ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపార్టీకి ఎన్ని సీట్లు కాదు.. ఎన్నికల్లో విజయమే లక్ష్యం : అఖిలేష్‌ యాదవ్‌

1 గంట క్రితం

akhilesh yadav
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 03:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లక్నో : ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానికన్నా ఎన్నికల్లో విజయం సాధించడమే కూటమి ప్రధాన లక్ష్యం కావాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్ష‍ుడు అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. లక్ష్యం స్పష్టంగా ఉండి కూటమి భాగస్వామ్య పక్షాలు కలిసి పనిచేసినప్పుడు ఆ గమ్యాన్ని చేరుకునే ప్రయాణం సులభతరమవుతుందని ఆదివారం ఆయన ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు అందరం కలిసి నిలబడతామని, గమ్యంపైనే దృష్టి సారించినపుడు ప్రయాణం సులభమవుతుందని అన్నారు. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల కేటాయింపు అనేది ప్రధాన సమస్యగా మారకూడదని ఆయన పునరుద్ఘాటించారు. కూటమికి ఎన్ని సీట్లు వచ్చాయి లేదా ఏ సీటు ఎవరికి దక్కింది అనేది ముఖ్యం కాదని, కూటమి విజయం సాధించేలా చూడటమే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. ఇది సీట్ల గురించి కాదని, విజయం గురించిన విషయమని అన్నారు. ప్రతిపాదిత కూటమి విజయం అనేది వ్యక్తిగత పార్టీల ప్రయోజనాల కంటే గొప్పదని అన్నారు. ఈ విజయం కూటమిలోని ఏ ఒక్క పార్టీకి చెందినది కాదని, అందరిదీ అని అన్నారు. మతతత్వం మళ్లీ తలెత్తకుండా, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, రిజర్వేషన్లపై బిజెపి ప్రభావం లేకుండా చేయడంతోపాటు దేశంలో సామరస్యాన్ని, అభివృద్ధి, సంక్షేమాన్ని పునరుద్ధరించేందుకు సాగుతున్న ఉమ్మడి పోరాటానికి ఇది విజయమని పేర్కొన్నారు. ‘‘రాజ్యాంగానికి విజయం.. హిందుస్థాన్‌కు విజయం’’ అని ఆయన తన పోస్టును ముగించారు.


ఉత్తరప్రదేశ్‌లో 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అఖిలేష్‌ యాదవ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్‌పి, కాంగ్రెస్‌ పార్టీలు ‘ఇండియా’ కూటమిగా కలిసి పోటీ చేశాయి. ఎస్‌పి 37 లోక్‌సభ స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా నిలవగా, కాంగ్రెస్‌ ఆరు స్థానాల్లో విజయం సాధించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్