శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మచిలీపట్నం మేయర్‌ అభ్యర్ధిగా షేక్‌ అబ్దుల్‌ అబిదా

1 గంట క్రితం

tdp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 09:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రెండో జాబితా ప్రకటించిన టిడిపి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మచిలీపట్నం మేయర్‌ అభ్యర్ధిగా షేక్‌ అబ్దుల్‌ అబిదాను టిడిపి బరిలోకి దింపింది. ఒక మున్సిపల్‌ ‌కార్పొరేషన్, 21 మున్సిప మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు టిడిపి తన అభ్యర్ధులను శనివారం ప్రకటించింది. ఆకివీడు మున్సిపాల్టీ అభ్యర్ధిగా నిలోఫర్‌ ‌షేక్‌‌ను, బేతంచెర్లకు ఐ లోకేష్ గౌడ్‌‌ను, బుచ్చిరెడ్డిపాలెం అభ్యర్ధిగా దొడ్ల విజయలక్ష్మిని, చీరాల అభ్యర్ధిగా యెరిచర్ల హనీ స్పందన, డోన్‌‌కు కొట్ల సుజాతమ్మ, గుత్తి నుంచి గోవిందరాజుల తమిళ్ సెల్వి, గుంతకల్లుకు యశోద, జంగారెడ్డిగూడెం అభ్యర్ధిగా రొంగుల అనుష, కదిరి అభ్యర్ధిగా షేక్ సమీరా,కళ్యాణదుర్గం నుంచి బుట్ల లక్ష్మి, కొండపల్లికి కన్నెకంటి అమూల్య, కొవ్వూరు అభ్యర్ధిగా జొన్నలగడ్డ రాధారాణి, నాయుడుపేట నుంచి షకీరా,నందిగామ అభ్యర్ధిగా శాకమూరి వంశీధర్, నందికొట్కూరుకు ఈఎం నబున్నిసా, నర్సీపట్నం అభ్యర్ధిగా చింతకాయల పద్మావతి, ప్రొద్దుటూరుకు నంద్యాల రాఘవరెడ్డి, వెంకటగిరి నుంచి దొంతు శారద, ఉయ్యూరు అభ్యర్ధిగా చేదురిపాటి ప్రవీణ్ కుమార్, ఏలేశ్వరం నుంచి యార్లగడ్డ అక్షిత, ఎమ్మిగనూరుకు మాచాని సునీతలను ప్రకటించింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్‌ ‌గడువు ముగియనుంది. ఇంకా మూడు కార్పొరేషన్లు, 28 మున్సిపాల్టీ , నగర పంచాయతీలకు టిడిపి అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్