గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదేశవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ నిరసనలు

25 నిమిషాల క్రితం

SFI holds nationwide protests demanding the resignation of Election Commissioner Gyanesh Kumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 12:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎస్‌ఐఆర్‌ రద్దు చేయాలి..

  • ఎన్నికల కమిషన్‌ను సంస్కరించాలి

​ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ​ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్జానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం 'నా నగరం.. జంతర్‌ మంతర్‌' నినాదంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఆందోళనల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియను రద్దు చేయాలని, ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ నేత‌లు డిమాండ్‌ చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని షిమ్లాలో డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు నిరసన తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని పరివర్తన్‌ చౌక్‌ వద్ద జరిగిన ఆందోళనలో విద్యార్థులు పాల్గొని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోనూ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. చెన్నైలో అంబేద్కర్‌ స్మారక స్థలం వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించి ఎస్‌ఐఆర్‌ ఉపసంహరణకు డిమాండ్‌ చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. కర్ణాటకలోని కలబుర్గిలో పాఠశాల విద్యార్థులు సహా పలువురు నిరసనలో పాల్గొన్నారు. రాజస్థాన్‌లోని ఝుంఝునులో మొరారిక కళాశాల ఎదుట, హర్యానాలోని రోహ్‌తక్‌ మహర్షి దయానంద్‌ విశ్వవిద్యాలయంలోనూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులపై చర్చలు నిర్వహించారు. ఢిల్లీలో 'పీపుల్‌ ఎగైనెస్ట్‌ ఎస్‌ఐఆర్‌' కూటమితో కలిసి ఎస్‌ఎఫ్‌ఐ నిరసన చేపట్టింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్