సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘స్వర్ణ కుప్పం’ లక్ష్యం : సిఎం చంద్రబాబు

52 నిమిషాల క్రితం

‘Swarna Kuppam’ is the goal: CM Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 01:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కుప్పం (చిత్తూరు) : ‘స్వర్ణ కుప్పం’ తన లక్ష్యమని సిఎం చంద్రబాబు అన్నారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పర్యటించారు. ఒకే రోజు పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేశారు. కుప్పంలో ఏర్పాటు చేసిన ‘స్వర్ణ కుప్పం’ బహిరంగ సభలో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ .... నారావారిపల్లె జన్మనిస్తే.. కుప్పం రాజకీయ జన్మనిచ్చిందన్నారు. తన మనసుకు దగ్గరగా కుప్పం ప్రజలే ఉంటారని తెలిపారు. కుప్పం ప్రజలు 40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా తనను ఎన్నుకుంటున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏ పని చేయాలన్నా కుప్పంలోనే ప్రారంభిస్తానన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వసతులు, ప్రతి కుటుంబానికి ఇల్లు ‘స్వర్ణ కుప్పం’ లక్ష్యం అని స్పష్టం చేశారు. అభివృద్ధితోనే మోడల్‌ నియోజకవర్గంగా మారుతుందన్నారు. రాయలసీమను ఎడారి కావనివ్వొద్దని నీటి ప్రాజెక్టులకు ఎన్టీఆర్‌ శ్రీకారం చుట్టారని తెలిపారు. శ్రీశైలం నుంచి కుప్పానికి 660 కి.మీ దూరానికి నీళ్లు తీసుకొచ్చామన్నారు. ఆచరణ సాధ్యం కాదనుకున్నవారు ఆశ్చర్యపోయేలా చేశామన్నారు. హెరిటేజ్‌ గ్రానైట్‌ స్టోన్‌ క్లస్టర్‌ ఏర్పాటుతో టూరిజాన్ని ఆకర్షిస్తామని వెల్లడించారు. రూ.2.5 కోట్ల వ్యయంతో మార్కెట్‌యార్డును అభివృద్ధి చేస్తాం అని సిఎం ప్రసంగించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్