సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మార్కాపురం కలెక్టరేట్‌ ఎదుట వెలిగొండ నిర్వాసితుల నిరసన

58 నిమిషాల క్రితం

veligonda2.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 01:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మార్కపురం : వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ (పునరావాసం–పునరావాస పరిహారం) ప్యాకేజీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిర్వాసితులు మార్కాపురం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించేందుకు నిర్వాసితులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్‌ వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం నిర్వాసితులు కలెక్టరేట్‌ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు, పరిహారం, పునరావాస సౌకర్యాలు వెంటనే కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని ఆలస్యం చేయకుండా అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

veligonda

veligonda.jpeg



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్