- ఊరు ఖాళీ చేస్తూ కన్నకొడుకు సమాధి వద్దే కూర్చుండిపోయిన దంపతులు
ప్రజాశక్తి-మార్కాపురం : వెలిగొండ ప్రాజెక్టు ముంపు బాధితుల కన్నీటి గాథలు హృదయాలను కలచివేస్తున్నాయి. మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామానికి చెందిన షేక్ మదర్ సాహెబ్, మహబున్నీ దంపతులు పది నెలల క్రితం తమ కుమారుడు మహమ్మద్ రఫీని (24) కోల్పోయారు. ప్రాజెక్టు ముంపు నేపథ్యంలో ఇవాళో రేపో ఇల్లు, ఊరు ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో, ఆ కన్నతల్లిదండ్రులు శనివారం ఉదయం తమ కుమారుడి సమాధి వద్దకు చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఊరు వదిలి వెళ్తే కన్నకొడుకు చివరి జ్ఞాపకమైన సమాధి కూడా తమకు దూరమవుతుందనే ఆవేదనతో, ఆ దంపతులు సమాధి వద్దే విలపిస్తూ కూర్చుండిపోయిన దృశ్యం స్థానికులను కలచివేసింది.







కామెంట్‌లు (0)