సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్టోబరు 15న ‘గరివిడి లక్ష్మి’

1 గంట క్రితం

garividi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 08:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌ ‘గరివిడి లక్ష్మి’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆనంది టైటిల్‌ పాత్రలో నటిస్తున్నారు. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నరేశ్‌, రాగ్‌ మయూర్‌, శరణ్య ప్రదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సోమవారం చిత్ర బృందం ప్రకటించింది. జానపద కళారూపమైన బుర్రకథకు విశేష ప్రాచుర్యం తీసుకొచ్చిన గరివిడి లక్ష్మి కళా ప్రయాణాన్ని ఈ చిత్రం ఆవిష్కరించనుంది. ఆమె జీవితంలోని కళా ప్రస్థానంతో పాటు మహిళల గుర్తింపు, సామాజిక పరిస్థితులను కూడా సినిమాలో ప్రస్తావించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ‘నల జిలకర మొగ్గ’, ‘కోయగూర’ వంటి జానపద గీతాలను ఇప్పటికే విడుదల చేశారు. ఉత్తరాంధ్ర జానపద సంగీతం, అక్కడి జీవనశైలి ప్రతిబింబించేలా పాటలను రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్