'పుష్ప` సినిమాతో ఫేమస్ అయిన నటుడు ఫహాద్ ఫాజిల్ '‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం గాంధీ జయంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బేబి సారా పాలేకర్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న తెలుగు,తమిళ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. నేడు ఉదయం 9 మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
గాంధీ జయంతికి ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 08:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)