అమరావతి : ఈ నెలలోనే అమరావతికి సంబంధించి రెండు కీలక ప్రారంభాలు ఉన్నాయని సిఎం చంద్రబాబు ప్రకటించారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా ఉపేక్షించబోమని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా బస్టాండ్‌లు, రహదారుల వెంట నిరసనలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ నిరసనల్లో రౌడీలు, గంజాయ్ బ్యాచ్‌లు తప్ప ఒక్కరైనా డీఎస్సీ అభ్యర్థులు ఉంటున్నారా ? అని మండిపడ్డారు. కర్నూలులో నేడు కదం తొక్కిన వారంతా మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులేనని తెలిపారు. గొడ్డలి పార్టీ చేసే నష్టం వల్ల.. ఉపాధ్యాయులు ఐక్యంగా తమ ఆత్మగౌరవం చాటారని సిఎం అన్నారు. ఆర్థిక వ్యవహారాలపై విడుదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందన్నారు. ప్రజెంటేషన్‌పై 10 గంటలు అధ్యయనం చేశానన్నారు. ఆర్థిక పరిస్థితి ప్రజలకు వివరిస్తేనే అర్థం చేసుకుంటారని తెలిపారు. నెలాఖరులోగా రెండు ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభిస్తామన్నారు. వెలిగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనకాపల్లి వరకూ ఈనెలలోనే సాకారం అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వచ్చే ఏడాది విశాఖ వరకూ తీసుకెళతామన్నారు. ఈ నెలలోనే అమరావతికి సంబంధించి రెండు కీలక ప్రారంభాలు ఉన్నాయని ప్రకటించారు. సీడ్ యాక్సిస్ ప్రారంభంతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అందుబాటులోకి వస్తాయన్నారు. వర్షాకాలంలోనూ అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల రెండు రోజుల్లో శ్రీశైలం నిండి, ఆ తర్వాత సాగర్‌కూ నీరొచ్చే అవకాశముందని ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ నెలలోనే అమరావతికి సంబంధించి రెండు కీలక ప్రారంభాలున్నాయి : సిఎం చంద్రబాబు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 08, 2026, 02:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)