శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గంజాయి చాక్లెట్లను తరలిస్తున్న ముగ్గురు యువకులు అరెస్ట్

27 నిమిషాల క్రితం

Three youths arrested for transporting cannabis chocolates.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 11:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తుని రూరల్‌ (కాకినాడ) : తుని రైల్వే స్టేషన్ లో గంజాయి చాక్లెట్లను తరలిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. గంజాయిని చాక్లెట్ల రూపంలో ప్యాకెట్లగా తయారుచేసి తరలిస్తున్న ముగ్గురు యువకులను తుని జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది శుక్రవారం అరెస్ట్‌ చేశారు. కాకినాడ జిల్లా తుని జీఆర్‌పీ ఎస్‌ఐ వి.సత్తిబాబుకు అందిన సమాచారం మేరకు .... నిన్న సాయంత్రం హౌరా-చెన్నై మెయిల్‌ జనరల్‌ కోచ్‌లో అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సమయంలో ముగ్గురు యువకులు తుని రైల్వేస్టేషన్‌ ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫారంపై లగేజ్‌ బ్యాగులతో దిగి అనుమానాస్పదంగా సంచరించడాన్ని సిబ్బంది గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని బ్యాగులను తనిఖీ చేయగా ఒక్కొక్కరి వద్ద మూడు చొప్పున గంజాయి చాకెట్ల ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిని మనోజ్‌ ప్రధాన్‌ (27), సంబునాథ్‌ జనా (29), అజయ్‌ జనా (25) గా గుర్తించారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి శనివారం కోర్టులో హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్