శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సంక్రాంతి బరిలో ‘కాకా’ : చిరంజీవి

10 నిమిషాల క్రితం

'Kaka' in the Sankranti fray: Chiranjeevi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 11:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ చిత్రం సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. కదిరి కాళిదాస్‌ పాత్రలో చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంలో అనస్వర రాజన్‌, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘సిగ్మా’ ప్రీరిలీజ్‌ వేడుకకు హాజరైన చిరంజీవి ‘కాకా’ చిత్రానికి సంబంధించిన తాజా వివరాలను వెల్లడించారు. సినిమా ఫస్ట్‌ హాఫ్‌ పూర్తయిందని, సెకండ్‌ హాఫ్‌ దాదాపు 30 శాతం పూర్తయిందని తెలిపారు. ఫస్ట్‌ హాఫ్‌కు తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ పనులు చేస్తున్నారని చెప్పారు. ‘‘కచ్చితంగా ఈ సంక్రాంతికి వస్తున్నాం. పండగ మనదే’’ అని చిరంజీవి పేర్కొన్నారు. దీంతో ఈ చిత్రం జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్పష్టత వచ్చింది. ఇప్పటికే షూటింగ్‌ కొనసాగుతుండగానే చిత్రబృందం డబ్బింగ్‌ పనులను కూడా ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘కాకా’ టీం‌ విడుదల చేసింది.


సంక్రాంతికి స్టార్‌ హీరోల సందడి ....

2027 సంక్రాంతి సందర్భంగా పలు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘కాకా’తో పాటు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌, కల్యాణ్‌ రామ్‌ నటిస్తున్న చిత్రం జనవరి 12న విడుదల కానుంది. కీర్తి సురేశ్‌, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. రజనీకాంత్‌ నటిస్తున్న ‘ధర్మన్‌’ కూడా సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. శర్వానంద్‌ ‘జార్జ్‌ క్రిష్‌’, సాయిదుర్గా తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’, శ్రియారెడ్డి, అక్షయ్‌ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మహాకాళి’ చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. దీంతో వచ్చే సంక్రాంతికి పలు అగ్ర కథానాయకుల చిత్రాలతో బాక్సాఫీస్‌ వద్ద పోటీ నెలకొననుంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్