ప్రజాశక్తి - శింగరాయకొండ : ప్రకాశం జిల్లాలోని పాకాల బీచ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. శింగరాయకొండ మండలంలోని పాకాల సముద్రంలో ఏడుగురు గల్లంతు కాగా ఒకరు మరణించారు. వివరాల ప్రకారం.. మార్కాపురం జిల్లా కనిగిరి దగ్గర శ్రీరంగపురం గ్రామానికి చెందిన కొంతమంది సరదాగా సముద్ర స్నానానికి వచ్చారు. గ్రామం నుంచి రెండు ఆటోలు నాలుగు కారుల్లో వారు సముద్రతీరానికి చేరుకున్నారు. సముద్రంలో ఈత కొడుతున్న సమయంలో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వారిలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఐదుగురిని రక్షించి, 108 వాహనంలో ఆసుపత్రి తరలించారు.
పాకాల సముద్రంలో ఇద్దరు గల్లంతు .. ఒకరు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 10, 2026, 03:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)