హింగోలి : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి)వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే నానమ్మ సావిత్రి భాయి మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్ పింప్రి గ్రామంలో శనివారం మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె దీప్కే తండ్రి భగవాన్ దీప్కే తల్లి. దీప్కే తల్లిదండ్రులు అనిత, భగవాన్ దీప్కేలు ప్రస్తుతం ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఉన్నారు. ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు హింగోలికి బయలుదేరే అవకాశం ఉంది. వారి నివాసం ఎదుట కూడా పోలీసులను మోహరించారు. దీప్కే కూడా ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల నిర్బంధంలో ఉన్నారు. సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ కోరుతూ జంతర్‌మంతర్ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు దీప్కే శనివారం ఉదయం ముంబయి నుండి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీప్కేకు ఈ సమాచారం తెలిసిందా, ఆమె అంత్యక్రియలకు అనుమతిస్తారా లేదా అనేది తెలియాల్సి వుంది.
అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 10, 2026, 04:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)