శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవలు అమోఘం

1 గంట క్రితం

aalamuru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 04:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెముడులంకలో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

ప్రారంభించిన టిడిపి సీనియర్ నేత, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి వెంకటరత్నం, సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి - ఆలమూరు : మండల పరిధి గ్రామాల్లో విరివిగా "ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్" ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల సౌకర్యార్థం చేస్తున్న సేవలు అమోఘమని టిడిపి సీనియర్ నేత, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి వెంకటరత్నం, సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు కొనియాడారు. మండలంలోని చెముడులంకలో శనివారం వారి ఆహ్వానం మేరకు ఉమెన్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఛైర్మన్ బూసి విద్యా ప్రసన్న ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణమండపంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ముందుగా మాజీ సర్పంచ్ నాగిరెడ్డి వెంకట రత్నం శిబిరం ప్రారంభించగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజమండ్రికి చెందిన శ్రీకర మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్, గౌతమి నేత్రాలయం, శ్రీ రమా దంత వైద్యశాల వైద్యులు సిబ్బందితో కలిసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో బీపీ, షుగర్, ఈసీజీ, గుండె, ఎముకలు, కంటి, దంత పరీక్షలు వంటివి రోగులకు ఉచితంగా అందజేశారు. అలాగే మహిళలకు లేడీ డాక్టర్లచే ప్రత్యేక పరీక్షలు, ఉచిత మందులు, ఉచిత కంటి ఆపరేషన్లు, 50 శాతం ఖరీదుతో కళ్లజోళ్లు అందజేయనున్నారని ట్రస్ట్ చైర్మన్, ఏజిపి బూసి విద్య ప్రసన్న, ఆమె భర్త ముప్పిరి వెర్రియ్య అన్నారు. పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు విచ్చేసి సేవలు సద్వినియోగం చేసుకోవడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ట్రస్ట్ మున్ముందు మరింతగా రాణించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు ముప్పిరి వెర్రియ్య, నాగిరెడ్డి సత్యానందం, కొత్తపల్లి రాంబాబు, అడబాల వీర్రాజు, అడ్డాల రాజు, గుండుమల్ల రాంబాబు, సిరంగుల సతీష్, పాలూరి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్