శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రయాణమా .. ప్రాణ సంకటమా..

1 గంట క్రితం

east godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 03:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మండపేట : అసలే పసి పిల్లలు , పైగా మూటలు , ఆపై ప్రమాదకర ప్రయాణం. మూసి ఉన్న రైల్వే గేట్‌ను దాటడం శిక్షార్హమని తెలిసినా పట్టించుకోని మనుషులు. దీనికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుందని చట్టాలు చెబుతున్నాయి. రైల్వే గేటు మూసి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాక్ దాటకూడదని, గేటు తెరిచే వరకు వేచి ఉండాలని, వాహనదారులు రైల్వే గేట్ దగ్గరకు రాగానే వేగాన్ని తగ్గించి, ఇరువైపులా చూసుకుని వెళ్ళాలని అనేక నిబంధనలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ప్రమాదకర ఫోటో. శనివారం మండపేట మండలంలోని కేశవరం వద్ద మూసి ఉన్న రైల్వే గేటును నిర్లక్ష్యంగా దాటుతున్న కుటుంబం. ప్రమాదం అని తెలిసి కూడా గేట్ దాటుతున్న వాహనదారుల నిర్లక్ష్యమా? లేదా చిన్నపిల్లలతో కలిసి గేట్ దాటుతున్నప్పటికీ అక్కడే ఉండి కూడా పట్టించుకోని రైల్వే సిబ్బంది నిర్లక్ష్యమా? ప్రేక్షక పాత్ర వహిస్తున్న తోటి ప్రయాణికుల బాధ్యతా రాహిత్యమా? ఇటువంటి ప్రయాణికులు, వాహనదారుల పై సంబంధిత రైల్వే అధికారులు చర్యలు చేపట్టాలని , నిబంధనలు కఠినంగా అమలు పర్చాలని, ఎటువంటి ప్రమాదాలు , ప్రాణ నష్టాలు జరగక ముందే సంబంధిత అధికారులు నిద్ర మత్తు వీడి బాధ్యతగా విధులు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్