అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండుగ సందర్భంగా .... హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ ... "వినాయక చవితి అనేది ఊళ్లు, పట్టణాలు అనే తేడా లేకుండా వాడవాడలా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ. అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చే గొప్ప సామాజిక వేడుక ఇది" అని వివరించారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను నొక్కిచెబుతూ, ప్రజలందరూ మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే పర్యావరణానికి మేలు చేసినవారమవుతామని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఆశీర్వదించాలని తాను గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు : సిఎం చంద్రబాబు
20 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 10:38 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)