ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పండుగ రోజు విషాద ఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. నరసరావుపేట నుంచి రొంపిచర్ల వైపు వెళుతుండగా, చెక్‌పోస్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ కు చెందిన బస్సు రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న రొంపిచర్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పండుగ రోజు విషాదం - ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొని ఇద్దరు మృతి
24 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 10:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)