- పోటీ పరీక్షల ప్రత్యేకం
శబ్దం వినిపిస్తే చెవులు అలర్ట్… కాంతి కనిపిస్తే కళ్ళు అలర్ట్… అయస్కాంతం దగ్గరికి వస్తే ఇనుము అలర్ట్! మరి పరీక్షలో Physics ప్రశ్న కనిపిస్తే? మీ మెదడు అలర్ట్ కావాలి! . ఎందుకంటే పోటీ పరీక్షల్లో “తెలుసు” అనుకోవడం కంటే, “సరైన సమయంలో గుర్తు తెచ్చుకుని సరైన సమాధానం గుర్తించడం” ముఖ్యం. శబ్దం, కాంతి, అయస్కాంతం మన రోజువారీ జీవితంలో నిత్యం ఎదురయ్యే అంశాలే. వాటి వెనుక ఉన్న Physicsను అర్థం చేసుకుంటే ప్రశ్నలు సులభంగా కనిపిస్తాయి. కాబట్టి… శబ్దం వినండి, కాంతిని గమనించండి, అయస్కాంతాన్ని అర్థం చేసుకోండి… చివరికి మీ ర్యాంక్‌ను ఆకర్షించండి.
1. శబ్ద తరంగాలు ఏ మాధ్యమంలో ప్రయాణించవు?
A) ఘనాలు B) ద్రవాలు C) వాయువులు D) శూన్యం
2. శబ్దం ఒక ....... తరంగం.
A) అడ్డ తరంగం B) దీర్ఘ తరంగం
C) విద్యుత్ తరంగం D) కాంతి తరంగం
3. శబ్ద వేగం అత్యధికంగా ఉండేది?
A) గాలిలో B) నీటిలో C) శూన్యంలో D) ఉక్కులో
4. మానవ చెవి వినగలిగే శబ్ద పౌనఃపున్యం?
A) 10–100 Hz
B) 20–20,000 Hz
C) 100–50,000 Hz
D) 1–10 Hz
5. ప్రతిధ్వని (Echo) స్పష్టంగా వినిపించడానికి కనీస కాలవ్యవధి ఎంత?
A) 0.1 సెకన్ B) 0.5 సెకన్ C) 1 సెకన్ D) 2 సెకన్
6. SONAR ఏ తరంగాలను ఉపయోగిస్తుంది?
A) రేడియో B) కాంతి C) అల్ట్రాసోనిక్ D) ఇన్‌ఫ్రారెడ్
7. అల్ట్రాసోనిక్ తరంగాల పౌనఃపున్యం?
A) 20 Hz కంటే తక్కువ
B) 20,000 Hz కంటే ఎక్కువ
C) 100 Hz D) 1000 Hz
8. శబ్ద స్థాయిని (Sound Level) కొలిచే ప్రమాణం ఏది?
A) జూల్ B) వాట్ C) డెసిబెల్ D) న్యూటన్
9. సంగీత వాయిద్యంలో శబ్దం ఏర్పడటానికి ప్రధాన కారణం?
A) ఉష్ణం B) ప్రకంపనలు C) అయస్కాంతం D) పీడనం
10. గబ్బిలాలు దారి తెలుసుకోవడానికి ఉపయోగించేది?
A) రేడియో తరంగాలు B) అల్ట్రాసోనిక్ తరంగాలు
C) కాంతి D) అయస్కాంతం
11. కాంతి వేగం శూన్యంలో?
A) 3×106 m/s B) 3×107 m/s
C) 3×108 m/s D) 3×109 m/s
12. కాంతి స్వభావం?
A) తిర్యక్ తరంగం B) దీర్ఘ తరంగం
C) యాంత్రిక తరంగం D) ధ్వని తరంగం
13. తెల్లని కాంతి ఎన్ని రంగులతో ఏర్పడింది?
A) 5 B) 6 C) 7 D) 8
14. ఇంద్రధనుస్సులో ఎక్కువ తరంగదైర్ఘ్యం (Wavelength) కలిగిన రంగు ఏది?
A) ఎరుపు B) నీలం C) ఆకుపచ్చ D) పసుపు
15. కాంతి పరావర్తన నియమం ప్రకారం పతన కోణం మరియు పరావర్తన కోణం మధ్య సంబంధం ఏమిటి?
A) పతన కోణం > పరావర్తన కోణం
B) పతన కోణం = పరావర్తన కోణం
C) పతన కోణం < పరావర్తన కోణం
D) రెండింటికీ సంబంధం లేదు
16. సమతల అద్దంలో ఏర్పడే ప్రతిబింబం ఏది?
A) నిజమైనది B) తలకిందులైనది C) మిథ్యా ప్రతిబింబం D) చిన్నది
17. కాంతి వక్రీభవనం సాధారణంగా ఎక్కడ జరుగుతుంది?
A) ఒకే మాధ్యమంలో B) రెండు మాధ్యమాల సరిహద్దులో
C) శూన్యంలో D) అయస్కాంత క్షేత్రంలో
18. కంటి లెన్స్ స్వభావం?
A) కుంభాకార B) పుటాకార C) సమతల D) ప్రిజం
19. సమీప దృష్టి లోపాన్ని సరిచేసే లెన్స్ ఏది?
A) కుంభాకార B) పుటాకార
C) ద్వికుంభాకార D) ద్విపుటాకార
20. హైపర్‌మెట్రోపియా ఉన్న వ్యక్తికి సూచించే కళ్లజోడు లెన్స్ ఏది?
A) కుంభాకార B) పుటాకార C) సమతల D) ప్రిజం
21. సూర్యకాంతిలో శరీరంలో విటమిన్-D ఉత్పత్తిని ప్రేరేపించే కిరణాలు ఏవి?
A) UV-B B) IR C) X-rays D) Gamma rays
22. కెమెరాలో ఉపయోగించే లెన్స్?
A) కుంభాకార B) పుటాకార C) సమతల D) ప్రిజం
23. పట్టకం ద్వారా తెల్లని కాంతి విడిపోవడాన్ని ఏమంటారు?
A) పరావర్తనం B) వక్రీభవనం C) విక్షేపణం D) వ్యతికరణం
24. చంద్రుడు ప్రకాశించడానికి కారణం?
A) తన స్వంత కాంతి B) సూర్యకాంతి పరావర్తనం
C) విద్యుత్ D) అయస్కాంతం
25. ఆప్టికల్ ఫైబర్ పనిచేసే సూత్రం?
A) వక్రీభవనం B) సంపూర్ణాంతర పరావర్తనం
C) విక్షేపణం D) ధ్రువణం
26. సహజ అయస్కాంతం?
A) ఇనుము B) లోడ్‌స్టోన్ C) ఉక్కు D) నికెల్
27. అయస్కాంతానికి ఎన్ని ధ్రువాలు ఉంటాయి?
A) 1B) 2C) 3D) 4
28. సజాతి ధ్రువాలు?
A) ఆకర్షించుకుంటాయి B) వికర్షించుకుంటాయి
C) ప్రభావం ఉండదుD) కలిసిపోతాయి
29. భూమి ఒక ....... లాగా ాగా పనిచేస్తుంది.
A) బ్యాటరీB) అయస్కాంతంC) జనరేటర్ D) లెన్స్
30. కంపాస్ సూది సాధారణంగా ఏ దిశను సూచిస్తుంది?
A) తూర్పు-పడమర B) ఉత్తర-దక్షిణ
C) ఉత్తర-తూర్పు D) దక్షిణ-పడమర
31. విద్యుత్ ప్రవాహం వల్ల ఏర్పడేది?
A) ఉష్ణం మాత్రమే B) కాంతి మాత్రమే
C) అయస్కాంత క్షేత్రం D) ధ్వని
32. విద్యుదయస్కాంత ప్రేరణ (Electromagnetic Induction) ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
A) అయర్‌స్టెడ్ B) న్యూటన్ C) ఐన్‌స్టీన్ D) మైఖేల్ ఫారడే
33. విద్యుదయస్కాంతంలో కోర్‌గా ఉపయోగించేది?
A) రాగి B) అల్యూమినియం C) మృదు ఇనుము D) వెండి
34. అయస్కాంత క్షేత్ర రేఖలు ఉత్తర ధ్రువం నుండి _____ వరకు వెళ్తాయి.
A) ఉత్తర ధ్రువం B) దక్షిణ ధ్రువం C) కేంద్రం D) శూన్యం
35. అయస్కాంత క్షేత్రం యొక్క SI ప్రమాణం ఏది?
A) టెస్లా B) గాస్ C) న్యూటన్ D) జూల్
36. MRI స్కానర్‌లో ఉపయోగించేది?
A) శబ్దం B) బలమైన అయస్కాంతం C) లెన్స్ D) ప్రిజం
37. ఫారడే ఏ ఆవిష్కరణకు ప్రసిద్ధి చెందారు?
A) విద్యుత్ ప్రేరణ B) కాంతి C) శబ్దం D) ఉష్ణం
38. విద్యుత్ మోటార్‌లో జరిగే శక్తి మార్పిడి ఏది?
A) విద్యుత్ శక్తి → యాంత్రిక శక్తి
B) యాంత్రిక శక్తి → విద్యుత్ శక్తి
C) కాంతి శక్తి → విద్యుత్ శక్తి
D) ఉష్ణ శక్తి → విద్యుత్ శక్తి
39. విద్యుత్ జనరేటర్‌లో జరిగే శక్తి మార్పిడి ఏది?
A) విద్యుత్ శక్తి → యాంత్రిక శక్తి
B) యాంత్రిక శక్తి → విద్యుత్ శక్తి
C) కాంతి శక్తి → విద్యుత్ శక్తి
D) ఉష్ణ శక్తి → విద్యుత్ శక్తి
40. అయస్కాంత పదార్థం కానిది?
A) ఇనుము B) కోబాల్ట్ C) నికెల్ D) చెక్క
41. SONAR ఏ భౌతిక దృగ్విషయానికి సంబంధించిన పరికరం?
A) కాంతి B) శబ్దం C) అయస్కాంతం D) విద్యుత్
42. CFC అనే సంక్షిప్త పదానికి పూర్తి రూపం ఏమిటి?
A) Carbon Free Compound B) Chlorofluorocarbon
C) Calcium Fluoride Carbon D) Chlorine Free Carbon
43. Loudspeakerలో విద్యుత్ సంకేతాలను శబ్దంగా మార్చడంలో ప్రధానంగా ఉపయోగపడేది ఏది?
A) అయస్కాంతం మరియు కాయిల్ B) ప్రిజం
C) లెన్స్ D) థర్మామీటర్
44. శూన్యంలో అత్యధిక వేగంతో ప్రయాణించేది ఏది?
A) శబ్ద తరంగాలు B) కాంతి C) నీటి తరంగాలు D) గాలి
45. ప్రతిధ్వని సంబంధిత అంశం?
A) శబ్దం B) కాంతి C) అయస్కాంతం D) విద్యుత్
46. మాగ్నెటిక్ కంపాస్ ఉపయోగం?
A) సమయం తెలుసుకోవడం B) దిశ తెలుసుకోవడం
C) ఉష్ణోగ్రత కొలవడం D) దూరం కొలవడం
47. స్పెక్ట్రమ్ ఏర్పడటానికి ఉపయోగించే పరికరం?
A) లెన్స్ B) ప్రిజం C) అయస్కాంతం D) కంపాస్
48. విద్యుదయస్కాంతమును ఉపయోగించే పరికరం?
A) ఎలక్ట్రిక్ బెల్ B) టార్చ్ C) అద్దం D) థర్మామీటర్
49. కాంతి ఒక మాధ్యమం నుండి మరొక మాధ్యమంలోకి ప్రవేశించినప్పుడు వక్రీభవనానికి ప్రధాన కారణం ఏమిటి?
A) కాంతి వేగం మారడం
B) కాంతి తీవ్రత మారడం
C) ఉష్ణోగ్రత మారడం
D) అయస్కాంత క్షేత్రం ఏర్పడడం
50. World Ozone Day ఎప్పుడు జరుపుకుంటారు?
A) June 5 B) July 11 C) October 2 D) September 16
- డాక్టర్. పల్లె. సూర్యనాగి రెడ్డి
భౌతికశాస్త్ర అధ్యాపకులు ప్రభుత్వ కళాశాల (అటానమస్), అనంతపురం. సెల్ : 9491155894







కామెంట్‌లు (0)