ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : చంద్రగిరిలో నివాసముంటున్న మునిరాజా బుల్లెట్ బైకును గుర్తుతెలియని దుండగులు ఆదివారం అర్థరాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టారు. వినాయక చవితి శుభాకాంక్షల బోర్డుల వివాదం వల్లే ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితుడు ఆరోపించారు. బైక్ పేలి ఉంటే ప్రాణ, ఆస్తి నష్టం జరిగేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ కు నిప్పంటించిన దుండగులు
30 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 10:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)