సోమవారం, 16 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బెదిరింపులు లేకుండా ఎన్నికల్లో గెలవాలి

6 గంటల క్రితం

ycp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 11:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వైసిపి నేత టిజెఆర్‌ సుధాకర్‌ బాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనైనా దౌర్జన్యాలు, బెదిరింపులు లేకుండా గెలవాలని వైసిపి ఎస్సి సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే టిజెఆర్‌ సుధాకర్ బాబు సూచించారు. నామినేషన్లు వేయనీయకుండా ‌వైసిపి అభ్యర్థులపై దాడులు సాగిస్తూ, పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో అడ్డగోలు గెలుపు కోసం అభ్యర్థులతో బేరసారాలు, ప్రలోభాలు, వేలంపాటలు నిర్వహించడం చంద్రబాబు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి పంచాయతీ ఎన్నికల్లో కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. 2024 ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేకపోయారని విమర్శించారు. మరోవైపు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నవరత్నాలతో పాటు 38 రకాల సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు మేలు చేశారని చెప్పారు. ఆ పాలనతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం లేక అధికార బలంతో ప్రతిపక్ష అభ్యర్థులను కనీసం పోటీ చేయనీయకుండా నామినేషన్ల పర్వంలోనే అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, బిజెపి నాయకులకు నిజంగా ప్రజలపై నమ్మకం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్