అవసరమైతే ఎన్నికల బహిష్కరణకు సిద్ధం కావాలి
ప్రజాశక్తి - కురుపాం : బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను పక్కనపెట్టి ఐక్యంగా పోరాడాలని కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ పిలుపునిచ్చారు. సోమవారం కురుపాం కోట వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘సర్’ విధానం ప్రమాదకరమని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు యువత, ప్రజలు ముందుకొచ్చి రెండో స్వాతంత్ర్య ఉద్యమం తరహాలో పోరాడాలని పిలుపునిచ్చారు. అవసరమైతే అన్ని పార్టీలు ఉమ్మడిగా ఎన్నికలను బహిష్కరించేందుకు కూడా సిద్ధం కావాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు రాజకీయ పార్టీలన్నీ ఐక్యంగా ముందుకు రావాలని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)