సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజల ఓట్లను తొలగించేందుకే ఎస్‌ఐఆర్‌ : సిఎం రేవంత్‌

1 గంట క్రితం

revanth reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 01:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ప్రజల ఓట్లను తొలగించేందుకే కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఐఆర్‌ను చేపడుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిందని అన్నారు. గతంలో ఓటు హక్కు కల్పించడానికి ఎస్‌ఐఆర్‌ చేపట్టారని, కానీ ప్రస్తుతం ప్రస్తుతం ప్రజల ఓట్లను తొలగించడానికే వినియోగిస్తున్నారని మండిపడ్డారు. సర్‌ ప్రక్రియ చేపట్టని రాష్ట్రాల్లో బిజెపి ఓడిపోయిందని, ఈ ప్రక్రియ చేపట్టిన బీహార్‌, బెంగాల్‌లో గెలిచిందని అన్నారు. దేశంలో జనాభా పెరుగుతుంటే ఓటర్ల సంఖ్య కూడా పెరగాలని, కానీ ఎందుకు తగ్గిందని కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రధాని మోడీ మోదీ తన అధికారం నిలబెట్టుకునేందుకు గతంలో ఈడి, సిఐడి, ఐటి విభాగాలను ప్రయోగించేవారని, ఇప్పుడు వాటితో ఉపయోగం లేదని ఈసిఐని వినియోగించుకుంటున్నారని విమర్శించారు. బిజెపి వ్యతిరేకుల ఓట్లను తొలగించేందుకే ఎస్‌ఐఆర్‌ను తీసుకువచ్చారని అన్నారు. తమ వ్యతిరేకుల ఓట్లు తొలగించాలని సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌కు టాస్క్‌ ఇచ్చారని అన్నారు. బిజెపిని వ్యతిరేకించేంది యువత, నిరుద్యోగులు, పేదలు. అందుకే వారి ఓట్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఇసిలో తప్పులు జరిగాయని మిగిలిన ఇద్దరు ఈసిలు వ్యతిరేకించారని, అంటే జ్ఞానేష్‌ కుమార్‌ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తేలిందని అన్నారు. అటువంటి అధికారిని తొలగించేందుకు మోడీకి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్