న్యూఢిల్లీ : భారత నౌకాదళం తన సముద్ర రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా మరో ముందడుగు వేసింది. జలాంతర్గామి నిరోధక నిస్సార జల నౌకల (ఏఎస్‌డబ్ల్యు-ఎస్‌డబ్ల్యుసి) శ్రేణిలో మూడవ నౌక అయిన ఐఎన్ఎస్ మంగ్రోల్‌ను సోమవారం ముంబయి తీరంలో సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టింది. వెస్ట్రన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఎనిమిది జలాంతర్గామి నిరోధక నిస్సార జల నౌకల్లో ఐఎన్ఎస్ మంగ్రోల్ మూడవది. 2026 ఆగస్టు 22న ఈ నౌకను భారత నౌకాదళానికి అప్పగించారు. అప్పగింత పత్రాలపై సీఎస్ఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) హరికృష్ణన్ ఎస్., ఐఎన్ఎస్ మంగ్రోల్ నియమిత కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ యు. శరణ్ కుమార్ సంతకాలు చేశారు. 80 శాతానికి పైగా స్వదేశీ భాగాలతో రూపొందిన ఈ నౌక భారతదేశ రక్షణ రంగంలో స్వావలంబన దిశగా సాధిస్తున్న పురోగతికి నిదర్శనంగా నిలుస్తుందని నేవీ అధికారులు తెలిపారు. స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణం, ఆయుధ వ్యవస్థలు, సెన్సార్ల అనుసంధానంలో దేశం సాధిస్తున్న సాంకేతిక సామర్థ్యాలను ఇది ప్రతిబింబిస్తోందని అన్నారు.
భారత నౌకాదళంలో చేరిన ‘ఐఎన్ఎస్ మంగ్రోల్’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 12, 2026, 01:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)