ప్రజాశక్తి-రాజవొమ్మంగి:
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు 100% రిజర్వేషన్ కల్పించాలని, జీవో నెంబర్ 3 ని తక్షణమే పునరుద్దించాలని, ఏజెన్సీ స్పెషల్ డిఎస్సీ ప్రకటించాలని పోలవరం జిల్లా రంపచోడవరం మండలం కాకవాడ పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు బృందం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏజెన్సీలో నెలకొన్న పలు సమస్యలు, గిరిజనలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గూర్చి ఉపముఖ్యమంత్రికి వివరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 3 పటిష్ట అమలు చేయాలని, ఏజెన్సీలో నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులతో భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వింత పత్రాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ సంఘం నాయకురాలు కోదండ వాసవి, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈతపల్లి సిరిమల్ రెడ్డి, గిరిజన సంఘ నాయకులు జర్తా రత్నం తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)