mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుంటూరు జిల్లా అభివృద్ధికి కృషి

23 గంటల క్రితం

bhashyam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- భాష్యం రామకృష్ణకు
ఘన స్వాగతం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: ఉమ్మడి గుంటూరు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రభుత్వ అధికారులతో సంప్రదించి కృషి చేస్తానన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీ నుంచి గుంటూరు వచ్చిన ఆయనకు శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్థానిక భాష్యం గరుడ క్యాంపస్‌ ‌నుంచి చంద్రమౌళి నగర్‌లోని ఆయన నివాసం వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాభిమానమే తనను ఈ స్థాయికి తీసుకువచ్చిందన్నారు. తనను ప్రతి ఒక్కరూ తమ వాడిగా, తమ ఇంట్లో వ్యక్తిగా అభిమానించడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. తనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌‌కు కృతజ్ఞతలు తెలిపారు. భాష్యం విద్యాసంస్థల ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తొలుత ఇన్నర్ రింగురోడ్డులోని భాష్యం గరుడ క్యాంపస్ నుండి ప్రారంభమైన ఆత్మీయ స్వాగత ర్యాలీ చిల్లీస్ రెస్టారెంట్ సర్కిల్, లాడ్జి సెంటర్, లక్ష్మీపురం మెయిన్ రోడ్డు, బృందావన్ గార్డెన్స్, ఐటీసీ వెల్కమ్ హోటల్, సాయిబాబా రోడ్డు ఎన్టీఆర్ విగ్రహం, భాష్యం మెయిన్ క్యాంపస్ వరకు కొనసాగింది. తాము ఎంతగానో అభిమానించే వ్యక్తి రాజ్యసభ సభ్యునిగా గుంటూరుకు రావడం ముదావహమంటూ పురప్రముఖలు రామకృష్ణను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, భాష్యం ప్రవీణ్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్