ప్రజాశక్తి - సూళ్లూరుపేట రూరల్ : ఇస్రోలోని అత్యంత కీలక కేంద్రాల్లో ఒకటైన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌కు (విఎస్‌ఎస్‌సికి) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ యు.పి.రాజీవ్‌ను కొత్త డైరెక్టర్‌గా శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన సంస్థ నియమించింది. ప్రస్తుతం విఎస్‌ఎస్‌సిలో అసోసియేట్ డైరెక్టర్, పరిశోధన, అభివృద్ధి విభాగంలో సేవలందిస్తున్న ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. దేశ ప్రయోగ వాహనాల అభివృద్ధిలో కీలక బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ రాజీవ్‌కు రాకెట్ నియంత్రణ వ్యవస్థలు, గైడెన్స్ టెక్నాలజీ రంగాల్లో దశాబ్దాల అనుభవం ఉంది. ఇస్రో చేపట్టిన పలు ప్రధాన ప్రయోగ వాహన కార్యక్రమాల్లో మిషన్ డిజైన్, సిమ్యులేషన్ ప్రక్రియలకు ఆయన నాయకత్వం వహించారు. కేరళం రాష్ట్రంలోని కొల్లం జిల్లా పతనాపురానికి చెందిన డాక్టర్ రాజీవ్, తిరువనంతపురం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఇంజనీరింగ్ పట్టా, ఎన్ఐటి కాలికట్లో ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ పీజీ, అనంతరం భారతీయ విజ్ఞాన సంస్థ, ఐఐఎస్‌సి బెంగళూరులో పిహెచ్‌డి పూర్తి చేసి ఇస్రోలో శాస్త్రవేత్తగా తన సేవలు అందిస్తున్నారు. భారత అంతరిక్ష ప్రయోగ వాహనాల రూపకల్పన, సాంకేతిక అభివృద్ధికి విశేషంగా దోహదపడిన ఆయనకు విఎస్‌ఎస్‌సి డైరెక్టర్ బాధ్యతలు అప్పగించడం ఇస్రోలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఆయన నాయకత్వంలో భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు, ప్రయోగ వాహనాల సాంకేతిక సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందనే ఆశాభావాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.
శ్రీహరికోట విఎస్‌ఎస్ పి డైరెక్టర్‌గా డాక్టర్ రాజీవ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 28, 2026, 12:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)