- రూ.2.5 లక్షలు దాటితే ఆధారాలు చూపాలి
- అన్ని రకాల పంటలకూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంపు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : బ్యాంకుల ద్వారా బంగారంపై రుణాలు తీసుకునే వారికి ఆర్‌బిఐ పలు ఆంక్షలు విధించింది. పంట రుణాలు తీసుకునే వారు వ్యవసాయ కోసమే వాడుతున్నారా? లేక డైయిరీ ఫాం కోసం వాడుతున్నారా? వంటి వివరాలను కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. వ్యవసాయేతర అవసరాలకు రుణాలు తీసుకుంటే ఇన్ కంట్యాక్స్ లేదా వేతన ధ్రువపత్రం (శాలరీ సర్టిఫికెట్) చూపించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన పంటకు పెంచిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వివరాలు ఇవే...
2026-27 సంవత్సరానికి సంబంధించి పలు రకాల పంటలకు స్కేల్ ఆఫ్ పైనాన్స్ పెంచుతూ స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. వరి పంటకు ఎకరా ఒక్కంటికీ ఖరీఫ్ లో ఇప్పటి వరకు రూ.46 వేలు నుంచి రూ.52 వేలు వరకు రుణం అందిస్తుండగా దానిని రూ.52 వేల నుంచి రూ.55 వేల వరకు పెంచారు. రబీలో అందించే రూ.50 వేల నుంచి రూ.55 వేల రుణ సౌకర్యాన్ని రూ.55 వేల నుంచి రూ.60 వేల వరకు పెంచారు. శ్రీ వరి సాగుకు గతేడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్ ల్లోనూ రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు రుణ సౌకర్యం కల్పించారు. దానిని ఇప్పుడు రూ.40 వేల నుంచి రూ.44 వేలకు పెంచారు. సాగు నీటి కాలువల కింద పండించే మొక్కజొన్న పంటకు రూ.45 వేల నుంచి రూ.47 వేల వరకు రుణ సౌకర్యం అందించేవారు. దానిని ఇప్పుడు రూ.47 వేల నుంచి రూ.49 వేలకు పెంచారు. సాగు నీటి వసతులు ఉన్న భూముల్లో పండించే రాగులకు గతేడాది రూ.20 వేల నుంచి రూ.25 వరకు రుణ సౌకర్యం అందించారు. ఇప్పుడు దానిని రూ.22 వేల నుంచి రూ.27 వేల వరకు పెంచారు. వర్షాధార భూముల్లో పండించే రాగులకు గతంలో రూ.18 వేల నుంచి రూ.22 వేల వరకు రుణ సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం దానిని రూ.19 వేల నుంచి రూ.24 వేల వరకు పెంచారు. వర్షాధార భూముల్లో సాగు చేసే మొక్కజొన్నకు గతేడాది రూ.28 వేల నుంచి రూ.31 వేల వరకు రుణ సౌకర్యం అందించేవారు. దానిని ఇప్పుడు రూ.31 వేల నుంచి రూ.34 వేలకు పెంచారు. సాగునీటి వసతులు ఉన్న భూముల్లో పండించే వేరుశనగకు గతంలో రూ.38 వేల నుంచి రూ.41 వేల వరకు రుణం అందించేవారు. ప్రస్తుతం దానిని రూ.41 వేల నుంచి రూ.44 వేల వరకు పెంచారు. వర్షాధార భూముల్లో పండించే వేరుశనగ పంటకు రూ.35 వేల నుంచి రూ.38 వేల వరకు రుణ సౌకర్యం అందించేవారు. ఇప్పుడు దానిని రూ.38 వేల నుంచి రూ.41 వేల వరకు పెంచారు. చెరకు పంటకు రూ.లక్ష నుంచి రూ.1.10 లక్షల వరకు రుణ సౌకర్యం అందించేవారు. ఇప్పుడు రూ.1.05 లక్షల నుంచి రూ.1.15 లక్షల వరకు పెంచారు. కొబ్బరి పంటకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు రుణ సౌకర్యం కల్పించేశారు. ప్రస్తుతం దానిని రూ.62 వేల నుంచి రూ.72 వేల వరకు పెంచారు. సాగు నీటి సౌకర్యం ఉన్న భూముల్లో పండించే పత్తి పంటకు గతేడాది రూ.48 వేల నుంచి రూ.55 వేల వరకు రుణ సౌకర్యం కల్పించారు. ఇప్పుడు దానిని రూ.52 వేల నుంచి రూ.57 వేలకు పెంచారు. వర్షాధార భూముల్లో పండించే పత్తికి రూ.46 వేల నుంచి రూ.51 వేల రుణ సౌకర్యాన్ని కల్పించేవారు. ఇప్పుడు దానిని రూ.50 వేల నుంచి రూ.55 వేలకు పెంచారు.









కామెంట్‌లు (0)