mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పొగాకు రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ అడ్డగింత

2 గంటల క్రితం

farmers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 12:12 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- నిరసనగా జాతీయ రహదారిపై ఆందోళన

​ప్రజాశక్తి - మర్రిపాడు (నెల్లూరు జిల్లా) : పొగాకు రైతుల వద్ద ఉన్న ఉత్పత్తిని వెంటనే కొనుగోలు చేసి పెట్టుబడి, శ్రమ వృథా కాకుండా తగిన మద్దతు ధర కల్పించాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు వద్ద శనివారం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి, పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. తొలుత రైతులు ట్రాకర్లతో ర్యాలీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఆత్మకూరు నుంచి మర్రిపాడు వైపు వస్తున్న ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మర్రిపాడు పోలీసు స్టేషన్‌‌కు తరలించారు. దీంతో, ఆగ్రహించిన రైతులు ముంబాయి-నెల్లూరు జాతీయ రహదారిపై మర్రిపాడు వద్ద ఆందోళనకు దిగారు. పొగాకు కొనుగోలు చేయాలని, పోలీసు వైఖరి నశించాలని పెద్ద ఎత్తున నినదించారు. కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిలో పొగాకు కనీసం ధర రూ.350 చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగారు. మర్రిపాడు మండలం నుండి దాదాపు వంద ట్రాక్టర్లతో భారీ ర్యాలీగా బయలుదేరి పొంగూరు డిసిపల్లి, కరటంపాడు, నెల్లూరు పాలెం మీదుగా ఆత్మకూరు ఆర్‌‌డిఒ కార్యాలయానికి చేరుకొని వినతిపత్రం ఇవ్వాలని రైతు సంఘం నాయకులు భావించారు. ఆత్మకూరు సిఐ గంగాధర్ మర్రిపాడులోనే ట్రాక్టర్లను నిలిపివేశారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు గిట్టుబాటు ధర లేక పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పొగాకు కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి రైతులకు గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారన్నారు. తక్కువ క్వాలిటీ అని ని‌ర్థారించి తక్కువ ధర ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం రేటుతో పోలిస్తే ఈ ఏడాది ధర చాలా తగ్గించడం చాలా అన్యాయమన్నారు. రైతులకు జరిగిన నష్టాలకు ప్రభుత్వ ప్రత్యేక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, సీనియర్ నాయకులు చండ్ర రాజగోపాల్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి లక్కు కృష్ణ ప్రసాద్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పూడిపర్తి జనార్ధన్, జిల్లా కోశాధికారి గోపసాని రమేష్, వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి మంగలి పుల్లయ్య, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గంటా లక్ష్మీపతి, సిఐటియు, సిపిఎం, కెవిపిఎస్, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్