బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆకట్టుకుంటున్న ‘జాతీయ సరస్ మేళా’..

17 అక్టోబర్, 2026

ఆకట్టుకుంటున్న ‘జాతీయ సరస్ మేళా’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 09:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : విజయవాడ పున్నమి ఘాట్ వేదికగా తొలిసారి నిర్వహిస్తున్న 'జాతీయ సరస్ మేళా' శ్రామిక మహిళల నైపుణ్యానికి, ఆర్థిక సాధికారతకు అద్దం పడుతోంది. గ్రామీణ మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ వేదిక కల్పించడమే ధ్యేయంగా ఈ మేళా సాగుతోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఏపీ 'సెర్ప్' సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ఢిల్లీ తర్వాత ఈ స్థాయిలో విజయవాడలో నిర్వహించడం మొదటిసారి. ఈ మేళాలో 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 1,500 మంది మహిళా స్వయం సహాయక సంఘాల వారు పాల్గొంటున్నారు. చేనేత, హస్తకళల కోసం ఉచితంగా 600 స్టాళ్లను కేటాయించి, ప్రయాణ, భోజన, వసతి సౌకర్యాలు కల్పించారు. సంప్రదాయ వంటకాల కోసం 50 లైవ్ ఫుడ్ స్టాళ్లతో ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ 40 వేల నుండి 50 వేల మంది సందర్శకులు తరలివస్తున్నారని ఎన్‌ఐఆర్‌డి అడిషనల్ డైరెక్టర్ సుధీర్ కుమార్, సెర్ప్ డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి తెలిపారు. ఇప్పటివరకు రూ. 2 కోట్లకు పైగా విక్రయాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మహిళలకు తమ వ్యాపారాలను విస్తరించేలా ఇక్కడ ఎన్‌ఐఆర్‌డిపిఆర్ నిపుణులు బ్రాండింగ్, ప్యాకేజింగ్‌లపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలను వివరించే కన్వర్జెన్స్ పెవిలియన్‌తో పాటు, మహిళల విజయగాథలను చాటే 'లఖ్‌పతి దీదీ' పెవిలియన్, హస్తకళల ప్రత్యక్ష తయారీని చూపే డెమో పెవిలియన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మేళా, గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు నిజమైన వేదికగా నిలుస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్