బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition23న డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్‌పర్సన్ల ఎన్నిక

1 గంట క్రితం

Zilla Parishad and Mandal Parishad elections to be held everywhere except in 3 mandals SEC
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 09:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలోని 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 87 మున్సిపల్, నగర పంచాయతీల్లో డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్‌పర్సన్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఈ నెల 23న పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర పునేఠా బుధవారం ప్రకటించారు. ఎన్నికైన మేయర్లు, ఛైర్‌పర్సన్లు, వార్డు సభ్యులకు ఈ నెల 18వ తేదీలోపు ఎన్నికల నోటీసులు జారీ చేయనున్నారు. అనంతరం 23న మున్సిపల్‌ కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లను, మున్సిపల్, నగర పంచాయతీల్లో వైస్‌ ఛైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు. సంబంధిత స్థానిక సంస్థలకు ఎన్నికైన వార్డు సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనివార్య కారణాలతో 23న ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోతే, మరుసటి రోజు 24న ప్రక్రియను పూర్తి చేయాలి. ఎన్నికల నిబంధనలు, చట్టపరమైన మార్గదర్శకాలను పాటిస్తూ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు పునేఠా సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్