బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రాణం తీసిన కుటుంబ కలహాలు

1 గంట క్రితం

death.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 09:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

  • అనంత జిల్లాలో రైలు పట్టాలపై విషాద ఘటన

ప్రజాశక్తి-యాడికి (అనంతపురం జిల్లా) : కుటుంబ కలహాలు మాటలకందని విషాదానికి దారి తీశాయి. కలహ కష్టాలను భరించలేని తల్లి ఇద్దరు కూతుళ్లను తనతో పాటు తీసుకెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా యాడికి మండలంలో బుధవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. యాడికి మండలం పుప్పాల గ్రామానికి చెందిన అనిల్‌ ‌గుత్తి సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌‌గా పని చేస్తున్నారు. ఆయనకు తొమ్మిదేళ్ల క్రితం పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామానికి చెందిన ప్రత్యూష (32)తో వివాహం అయ్యింది. వారికి భావన (7), పల్లవి (3) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. గత రెండు రోజులుగా ఇంట్లో ఘర్షణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రత్యూష తన ఇద్దరు పిల్లలతో సహా బుధవారం ఉదయం యాడికి మండలం వేములపాడు గ్రామంలోని రైల్వే ట్రాక్‌ ‌వద్దకు వెళ్లారు. గుంతకల్లు వైపు వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యూష, పల్లవి మరణించారు. రైలు ఢీకొని తలకు తీవ్ర గాయాలతో ట్రాక్‌ ‌పక్కన పడిపోయిన భావనను చికిత్స నిమిత్తం రాయలచెరువు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు చిన్నారి అప్పటికే మరణించిందని తెలిపారు. ఈ ఘటనలో పుప్పాల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్