బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దుర్గాదేవిగా దుర్గమ్మ....

18 అక్టోబర్, 2026

దుర్గాదేవిగా దుర్గమ్మ.. 
- భారీగా పోటెత్తిన యాత్రికులు
తెప్పోత్సవానికి అధికార్లు ఏర్పాటు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 09:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- భారీగా పోటెత్తిన యాత్రికులు

తెప్పోత్సవానికి అధికార్లు ఏర్పాటు

ప్రజాశక్తి-ఎన్‌‌టిఆర్‌ జిల్లా ప్రతినిధి విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఎనిమిదవ రోజు అత్యంత వైభవంగా జరిగాయి. దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం అమ్మవారిని ‘శ్రీ దుర్గాదేవి’గా అలంకరించారు. ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే రెండు తెలుగు రాష్ట్రాల నుండి యాత్రికులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు నుంచి 4.30 గంటల సమయం పట్టింది. యాత్రికుల రద్దీ దృష్ట్యా ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు విఐపి బ్రేక్ దర్శనాలను ఆలయ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. శనివారం ఒక్క రోజే ఏకంగా రెండు లక్షలకు పైగా లడ్డు ప్రసాదాలు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన 'లడ్డు ఎటిఎం' కేంద్రాలకు విశేష స్పందన లభిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా నగదు చెల్లించిన కొద్ది సెకన్లలోనే లడ్డు ప్రసాదం చేతికి అందుతుండడంతో యాత్రికులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం మహానవమి సందర్భంగా అమ్మవారిని ‘శ్రీ మహిషాసురమర్ధిని’గా అలంకరిస్తారు.

హంస వాహనం ట్రయల్‌ రన్‌

హంసవాహన తెప్పోత్సవ ఏర్పాట్లను దుర్గగుడి అధికారులు, జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెప్పోత్సవానికి సంబంధించి ఆదివారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. వాహన నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, యాత్రికులకు అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను అధికారులు పరిశీలించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్