మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పార్లమెంటు ద్వారానే ‘కొటియా’ వివాదం పరిష్కారం

23 గంటల క్రితం

palla.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 09:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదానికి పార్లమెంటు ద్వారానే పరిష్కారం లభించాల్సి ఉందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. అప్పటి వరకు ఎలాంటి బలవంతపు చర్యలకు తావులేకుండా శాంతియుత వాతావరణం కొనసాగించాలని కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొటియా గిరిజనుల హక్కులు, మనోభావాలను గౌరవించాలని, సరిహద్దు వివాదానికి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. గిరిజనులను ఒడిశా పోలీసులు నిర్బంధించి, భయభ్రాంతులకు గురిచేస్తూ ఓటు హక్కు వినియోగానికి ఆటంకం కలిగిస్తున్నారన్న ఆరోపణలు ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ విషయంలో ఒడిశా పోలీసులు సంయమనం పాటిస్తూ గిరిజనుల హక్కులు, మనోభావాలను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దీర్ఘకాలిక సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, దౌత్యపరమైన చర్చల ద్వారా వీలైనంత త్వరగా సామరస్యపూర్వక పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్