సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రూ.16.50 లక్షల కోట్ల రుణమాఫీపై శ్వేత పత్రం

32 నిమిషాల క్రితం

రూ.16.50 లక్షల కోట్ల రుణమాఫీపై శ్వేత పత్రం
- కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ డిమాండ్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 11:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ డిమాండ్

ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : జాతీయ బ్యాంకుల్లో రూ.16.50 లక్షల కోట్ల రుణమాఫీపై తక్షణం శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు. విశాఖలోని విజెఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశ ఆ‌ర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉందన్నారు. అందరు ప్రధానులు చేసిన విదేశీ అప్పు రూ.50 లక్షల కోట్లు ఉంటే, మోడీ సర్కారు చేసిన అప్పు రూ.150 లక్షల కోట్ల ఉందని తెలిపారు. దమ్ముంటే చేసిన అప్పుపై మోడీ సమాధానం చెప్పాలన్నారు. బిజెపి హయంలో విపరీతమైన అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. మోడీ హయాంలో జాతీయ బ్యాంకుల్లో రూ.16.50 లక్షల కోట్ల రుణమాఫీ జరిగిందని, దీనిలో భారీ అవినీతి ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో కిలో బియ్యం రూ.20 ఉంటే బిజెపి పాలనలో రూ.వందకు పెరిగిందని, లీటరు పెట్రోలు కాంగ్రెస్ పాలనలో రూ.60 ఉంటే నేడు రూ.120కి పెంచారని విమర్శించారు. విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు ‌రోజుకు రూ.40 చొప్పున, నెలకు రూ.1,200 ఇస్తున్నారని, కేవలం రూ.40తో మూడు పూటలా తిండి ఎలా తింటారని ప్రశ్నించారు. ఒబిసి, ఎస్‌‌సి, ఎస్‌‌టి విద్యార్థులకు నెలకు రూ.ఐదు వేలు స్కాలర్‌‌షిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో వసతులు లేక, సరిపడా వైద్యులు, సిబ్బంది లేక చాలా మంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్