ఫిలిప్స్, మిఛెల్ అద్భుత పోరాటం
న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ డ్రా
వెల్లింగ్టన్ : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రా అయ్యింది. చివరిరోజు విజయం కోసం టీమిండియా బౌలర్లు చేసిన ప్రయత్నాలను కివీస్ బ్యాటర్లు వమ్ముచేశారు. ఓవర్‌నైట్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 119 పరుగులతో సోమవారం ఆటను కొనసాగించిన న్యూజిలాండ్ ఆట ముగిసేసరికి 5వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. డారిల్ మిఛెల్, గ్లెన్ ఫిలిప్స్ 43 ఓవర్లు క్రీజులో నిలిచి (259 బంతులు) టీమిండియా విజయాన్నికి అడ్డుగోడగా నిలిచారు. మిచెల్ (186 బంతుల్లో 49 నాటౌట్), ఫిలిప్స్ (126 బంతుల్లో 26 నాటౌట్) అద్భుత పోరాటం చేశారు. ఓవరాల్‌గా వీరిద్దరు 259 బంతులు ఎదుర్కొని 63 పరుగులు జోడించారు. ఇది న్యూజిలాండ్‌కు ఒక రికార్డు. భారత్‌తో టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో సుదీర్ఘ ఓవర్లు బ్యాటింగ్ చేయడం న్యూజిలాండ్‌కు ఇది రెండోసారి. 2014 లో భారత్‌తో జరిగిన టెస్టులో బ్రెండన్ మెక్‌కల్లమ్, బీజే వాట్లింగ్ ఆరో వికెట్‌కు రికార్డు స్థాయిలో 123 ఓవర్లలో 352 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పా రు. టెస్టుల్లో ఈ జోడి సాధించిన మారథాన్ పరుగు లు ఇప్పటికీ ఆల్ టైమ్ రికార్డుగా ఉండడం విశేషం.
రికార్డు బౌలర్లు...
న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ డ్రా అయినా.. భారత్ మాత్రం ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఎనిమిది మందితో బౌలింగ్ చేయించాడు. ఇలా ఒక టెస్టు మ్యాచ్‌లో ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ బౌలర్లు బౌల్ చేయడం ఇది 28వ సారి. రెగ్యులర్ బౌలర్స్ బుమ్రా (20 ఓవర్లు) , ఆకాశ్ దీప్ (20 ఓవర్లు), అన్షుల్ కాంబోజ్ (22 ఓవర్లు), ప్రసిధ్ క్రిష్ణ (19 ఓవర్లు), వాషింగ్టన్ సుందర్ (35 ఓవర్లు) బౌలింగ్ వేశారు. వీరికి అదనంగా పడిక్కల్, ధ్రువ్ జురెల్ ఒక్కో ఓవర్, జైస్వాల్ రెండు ఓవర్లు బౌల్ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో భారత్ తరఫున ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మందితో బౌలింగ్ చేశారు. గతంలో రెండు సందర్భాల్లో మాత్రమే రెండు వరుస టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది భారత బౌలర్లు బౌలింగ్ వేశారు.
డబ్ల్యుటిసి ఫైనల్ బెర్త్ రసవత్తరం...
డబ్ల్యుటిసి ఫైనల్ టాప్-2 జట్ల మధ్య జరగనుంది. ఈ క్రమంలో భారత్ చివరి టెస్ట్‌లో విజయం సాధిస్తే.. విజయాల శాతంలో మెరుగుదల కనబడనుంది. ప్రస్తుతం భారత్ నాలుగో స్థానంలో ఉన్నా.. మిగిలిన టెస్టుల్లో మెరుగైన ఫలితాలు సాధించాల్సి ఉంది. ముఖ్యంగా విజయాల సంఖ్యను పెంచుకుంటూ పాయింట్ల శాతాన్ని మెరుగుపరుచుకోవాలి. జూన్ 2027లో డబ్ల్యుటిసి ఫైనల్ జరగనుంది. దీనికి ముందు భారత్ ఆరు టెస్ట్‌లు ఆడనుంది. ఇందులో ఐదు గెలిస్తేనే ఫైనల్ అవకాశాలు ఉంటాయి. టీమిండియా తదుపరి న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్ ఆడనుంది. ఈ మ్యాచ్ క్రైస్ట్‌చర్చ్ వేదికగా నవంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. అనంతరం భారత్ వచ్చే ఏడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లో సాధించే ఫలితాలు ఫైనల్ రేసులో భారత అవకాశాలను ప్రభావితం చేస్తాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గ్లెన్ ఫిలిప్స్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు...
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : 368ఆలౌట్
ఇండియా తొలి ఇన్నింగ్స్ : 720/9డిక్లేర్డ్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (సి)పంత్ (బి)బుమ్రా 0, కాన్వే (సి)పంత్ (బి)సుందర్ 65, నికోల్స్ (సి)జురెల్ (బి)ప్రసిధ్ 31, రచిన్ రవీంద్ర (సి)కెఎల్ రాహుల్ (బి)ప్రసిధ్ కృష్ణ 37, మిఛెల్ (నాటౌట్) 49, బ్లండెల్ (సి)పంత్ (బి)కంబోజ్ 15, ఫిలిప్స్ (నాటౌట్) 26, అదనం 16. (120 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 239పరుగులు. వికెట్ల పతనం: 1/0, 2/60, 3/132, 4/139, 5/176 బౌలింగ్: బుమ్రా 20-7-42-1, ఆకాశ్ దీప్ 20-6-47-0, కంబోజ్ 22-5-45-1, ప్రసిధ్ 19-10-23-2, సుందర్ 35-14-65-1, పడిక్కల్ 1-0-2-0, జైస్వాల్ 2-0-4-0, జురెల్ 1-0-1-0.







కామెంట్‌లు (0)