- 11 రోజులకే తిరిగి పగ్గాలు
వాషింగ్టన్ : ఎన్వీడియా సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ తిరిగి కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా బాధ్యతలు చేపట్టారు. నవంబర్ 12న ఆయన తన పదవికి రాజీనామా చేసిన 11 రోజుల వ్యవధిలోనే కంపెనీ బోర్డు తిరిగి నియమించింది. హువాంగ్ నాయకత్వమే కంపెనీ, ఉద్యోగులు, భాగస్వాములు, వినియోగదారులు, వాటాదారుల ప్రయోజనాలకు ఉత్తమమని బోర్డు నిర్ణయించినట్లు కొత్త బోర్డు చైర్మన్ హార్వీ జోన్స్ ప్రకటించారు. హువాంగ్ నాయకత్వ సామర్థ్యం, పారదర్శకతపై బోర్డు సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. ఈ నిర్ణయానికి ముందు అమెరికా ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాల అభిప్రాయాలను కూడా తీసుకున్నట్లు వెల్లడించింది. ఆ కంపెనీ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల వ్యక్తిగత సంబంధాలపై వచ్చిన ఆరోపణలు, చైనాతో సంబంధాలపై వెల్లువెత్తిన వివాదాల నేపథ్యంలో హువాంగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎఐ రంగంలో కీలక చిప్‌ల తయారీ సంస్థగా ఎదిగిన ఎన్వీడియా ప్రపంచ జిపియు మార్కెట్‌లో సుమారు 90 శాతం వాటాను కలిగి ఉండగా.. గత ఏడాది 4 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను దాటిన తొలి సంస్థగా నిలిచింది.







కామెంట్‌లు (0)