సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బంగ్లాదేశ్‌ 91పరుగులకే ఆలౌట్‌

39 నిమిషాల క్రితం

test
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 10:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దక్ష‍ిణాఫ్రికాతో రెండో టెస్ట్‌

సెంచూరియన్‌: దక్ష‍ిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే కుప్పకూలింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాను సఫారీ బౌలర్లు కట్టడి చేశారు. రబడా(3/23), యాన్సెన్‌(3/17), నోకియా(2/10)కి తోడు ముల్డర్‌, హార్మర్‌ ఒక్కో వికెట్‌తో చెలరేగారు. దీంతో బంగ్లాదేశ్‌ బ్యాటర్లు పెవీలియన్‌కు వరుసగా క్యూ కట్టారు. బంగ్లాదేశ్‌ బ్యాటర్లలో మోహిఫుల్‌(23), మోమినుల్‌(18), హృదయ్‌(19) మాత్రమే రెండంక్కెల స్కోర్‌ చేయగా.. తమీమ్‌(3), కెప్టెన్‌ నజ్ముల్‌(4), వికెట్‌ కీపర్‌ లింటన్‌ దాస్‌(8) స్వల్ప స్కోర్లకే పెవీలియన్‌కు చేరారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్ష‍ిణాఫ్రికా జట్టు తొలిరోజు ఆట ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 98 పరుగులు చేసింది. కెప్టెన్‌ మార్క్‌క్రమ్‌(21) ఔటవ్వగా.. అకెర్మన్‌(45), హంజా(9) క్రీజ్‌లో ఉన్నారు. ఇరుజట్ల మధ్య జొహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో దక్ష‍ిణాఫ్రికా జట్టు 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రెండు టెస్టుమ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యతలో ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్