ప్రజాశక్తి-మారేడుమిల్లి: మారేడుమిల్లి మండలంలోని ఉత్తలూరు రహదారిలో స్థానిక వుడ్ రిసార్ట్ సమీపంలో ఓ అడవి దున్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై సంబంధిత అటవీ రేంజ్ అధికారి కరుణాకర్ మాట్లాడుతూ.. మేత మేస్తున్న క్రమంలో అడవిలో ఉండే విషపూరితమైన ఆకు దేలును తినడం వల్ల అడవి దున్న మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. అనంతరం నిబంధనల ప్రకారం పంచనామా నిర్వహించి, మృతిచెందిన అడవి దున్నను ఖననం చేసినట్లు వెల్లడించారు.
అడవి దున్న మృతి
16 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 16, 2026, 09:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)