సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎండిపోతున్న చీని చెట్లు..

11 సెప్టెంబర్, 2026

atp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 04:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అడుగంటి పోతున్న బోర్లు

అప్పుల ఊబిలో రైతులు

ప్రజాశక్తి - పుట్లూరు : మండలంలో నీరు లేక చీని చెట్లు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాల అడుగంటి పోవడంతో నీటి ట్యాంకులకు, బోర్లకు, లక్షలు ఖర్చుపెట్టినా పండ్ల తోటలను కాపాడుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలినినోతో రైతులు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 1000 అడుగుల నుంచి 1500 అడుగుల వరకు బోర్లు వేసిన ఒక చుక్క కూడా నీరు రావడంలేదని వాపోతున్నారు. నీటి ట్యాంకుల ద్వారా నీటిని సరపర చేసినా కూడా ఎండల వేడికి చిని చెట్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతలపల్లి గ్రామానికి చెందిన రైతు రమణ మాట్లాడుతూ.. గరుగు చింతల పల్లె పొలంలో తమకు 4. 50 సెంట్లు భూమి ఉందని, 8 సంవత్సరాల క్రితం చీని చెట్లు నాటామని అన్నారు. ఈసారి వర్షాలు లేకపోవడంతో చీని చెట్లను కాపాడుకోవడం కోసం రెండు బోర్లు వేశామని, ఒక్క చుక్క కూడా నీరు పడలేదని అన్నారు. బోర్ల కోసం లక్షల రూపాయల అప్పు చేశామని, కానీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే గ్రామానికి చెందిన మరొక రైతు రమేష్ మాట్లాడుతూ.. తమకు ఉన్న రెండున్నర ఎకరాలలో చీని నాటామని అన్నారు. చెట్లను బతికించడం కోసం లక్ష రూపాయలు ఖర్చు చేశామని, కానీ చెట్లు బతకలేదని రమేష్ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని మండలంలోని పండ్ల తోటల రైతులు వేడుకుంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్