తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక గీతమైన "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" రచించిన మహాకవి శంకరంబాడి సుందరాచారి జయంతి సందర్బంగా .... వైసిపి అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతంతో తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిన రచయిత, మహాకవి అంటూ వైఎస్ జగన్ ప్రశంసించారు. తెలుగు సంస్కృతి వైభవాన్ని అక్షరాల్లో అజరామరం చేసిన మహాకవి శంకరబాడి సుందరాచారి అని, తెలుగు నేల గొప్పతనాన్ని, తెలుగు తల్లి కీర్తిని తన కలంతో తరతరాలకు చాటి చెప్పారన్నారు. శంకరంబాడి సుందరాచారి సాహితీ సేవలు చిరస్మరణీయమన్నారు.
శంకరంబాడి సుందరాచారికి వైఎస్ జగన్ నివాళి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 04:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)