బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖలో ఘనంగా ప్రారంభమైన 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్

12 నవంబర్, 2026

cii
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 10:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 59 దేశాల నుంచి 1,250 మందికి పైగా ప్రతినిధుల హాజరు

- పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై కీలక చర్చలు

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ: విశాఖపట్నం వేదికగా 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌-2026 మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. నవంబర్ 12, 13 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు. ముగింపు వేడుకలకు బుధవారం భారత ఉపరాష్ట్రపతి సీ.పీ.రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 'వాణిజ్యం, సాంకేతికత, నమ్మకం, నాయకత్వం' అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. ఇందులో 59 దేశాలకు చెందిన 1,250 మందికి పైగా ప్రతినిధులు, 15 మంది విదేశీ మంత్రులు, 40 మందికి పైగా అంతర్జాతీయ వక్తలు పాల్గొంటున్నారు. భవిష్యత్ పరిశ్రమలు, సాంకేతిక ఆవిష్కరణలు, క్లీన్ ఎనర్జీ, అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, ఫుడ్ సెక్యూరిటీ, భవిష్యత్ రవాణా వ్యవస్థలు తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సు ద్వారా గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక వేదికను కూడా ఏర్పాటు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్