బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యుద్ధనౌకల తయారీకి హెచ్‌ఎస్‌ఎల్‌–సైయెంట్‌ ఒప్పందం

13 నవంబర్, 2026

యుద్ధనౌకల తయారీకి హెచ్‌ఎస్‌ఎల్‌–సైయెంట్‌ ఒప్పందం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 08:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖపట్నం: యుద్ధనౌకల నిర్మాణంలో స్వదేశీ సాంకేతికతను ప్రోత్సహించే దిశగా హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌), సైయెంట్‌ డిఎల్‌ఎం సంస్థలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. నౌకల నావిగేషన్‌, కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలను దేశీయంగా అభివృద్ధి చేసి, తయారు చేసేందుకు వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై సంతకాలు చేశాయి. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌లో ఈ ఒప్పందాన్ని పరస్పరం చేసుకున్నారు. హెచ్‌ఎస్‌ఎల్‌ డైరెక్టర్‌ (షిప్‌బిల్డింగ్‌) కెప్టెన్‌ గంటి వెంకటేశ్వర్లు, సైయెంట్‌ డిఎల్‌ఎం ఎండి, సిఇఒ రాజేంద్ర వెలగపూడి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పాల్గొన్నారు. భాగంగా రాడార్లు, నావిగేషన్‌ పరికరాలు, ఆటోపైలట్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, వాయేజ్‌ డేటా రికార్డర్లు, వాతావరణ సమాచార వ్యవస్థలు తదితరాలను దేశీయంగా తయారు చేయనున్నారు. తద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, నౌకల నిర్వహణ వ్యయాలను తగ్గించడంతో పాటు దేశీయ ఎంఎస్‌ఎంఇలు, సాంకేతిక సంస్థలకు అవకాశాలు కల్పించనున్నారు. తొలుత ఎంపిక చేసిన వ్యవస్థలపై ఉమ్మడిగా రూపకల్పన, పరీక్షలు నిర్వహించి, అవసరమైన ధ్రువీకరణలు పొందిన అనంతరం 18 నెక్స్ట్‌ జనరేషన్‌ ఫాస్ట్‌ పెట్రోల్‌ వెసల్స్‌లో వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ భాగస్వామ్యం రక్షణ రంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్య సాధనకు దోహదపడుతుందని హెచ్‌ఎస్‌ఎల్‌ సిఎండి రియర్‌ అడ్మిరల్‌ సి. రఘురామ్‌, సైయెంట్‌ డిఎల్‌ఎం ఎండి రాజేంద్ర వెలగపూడి ఆశాభావం వ్యక్తం చేశారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్