బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎపిలో రూ.3 లక్షల కోట్లతో రహదారుల అభివృద్ధి

13 నవంబర్, 2026

ఎపిలో రూ.3 లక్షల కోట్లతో రహదారుల అభివృద్ధి 
- సిఐఐ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 09:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిఐఐ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రూ.3 లక్షల కోట్లతో రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ 2014లో 4,100 కిలోమీటర్లు ఉండగా ప్రస్తుతం 8,700 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. రూ.14 వేల కోట్లతో 340 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న బెంగళూరు–కడప–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ 2027 డిసెంబరు నాటికి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రూ.16 వేల కోట్లతో 460 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రాయ్‌పూర్‌–విశాఖపట్నం కారిడార్‌ 2027 నాటికి పూర్తవుతుందని తెలిపారు. దీనివల్ల ప్రయాణ సమయం 13 గంటల నుంచి ఐదు గంటలకు తగ్గడంతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు విశాఖ పోర్టుతో అనుసంధానం మెరుగుపడుతుందన్నారు. హైదరాబాద్‌–విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిని రూ.12 వేల కోట్లతో ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. ఖరగ్‌పూర్‌–విశాఖపట్నం–అమరావతి కారిడార్‌ను రూ.71 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నామని, ఇందులో ఎపి వాటా రూ.30 వేల కోట్లని, విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు రహదారి అనుసంధానం కల్పించనున్నామని వివరించారు. అమరావతి చుట్టూ 190 కిలోమీటర్ల మేర రూ.32 వేల కోట్లతో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, కేంద్ర కేబినెట్‌ ఆమోదం రావాల్సి ఉందని ‌తెలిపారు. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్