బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖ పార్టనర్‌‌షిప్‌ సమ్మిట్లు బోగస్‌

14 నవంబర్, 2026

scy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 08:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విశాఖపట్నంలో నిర్వహించిన పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్లు అన్నీ బోగస్‌ అని ఇప్పుడు టిడిపి, గతంలో వైసిపి నిర్వహించిన సమ్మిట్లలో ఎంఒయులకు, వచ్చిన పెట్టుబడులకు, ఉద్యోగాలకు సంబంధమే లేదని భారత చైతన్య యువజన (బిసివై) పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్‌ ‌విమర్శించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని, స్టేజీల మీద సూట్లూ కోట్లు వేసుకున్నవారు ఎవరూ రూ.వందల కోట్లు పెట్టుబడులుగా ఏనాడూ పెట్టలేదని విమర్శించారు. ఈ సమ్మిట్లు అన్నీ తమకు కావాల్సిన వారికి నామమాత్ర ధరకు భూములు అమ్ముకునే కుటిల పథకంలో భాగం మాత్రమేనని విమర్శించారు. ప్రతి సంవత్సరం అదే పారిశ్రామికవేత్తలు, అవే కోట్లు, అవే సీన్లు పరిశ్రమలు, ఉద్యోగాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమలు మరింత భారీగా పెట్టుబడి పెడుతున్నాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, సంతకాలు చేశాం అని, ఎంఒయులు కుదిరాయని సమ్మిట్లలో ప్రకటించిన విధంగా ఏ ఒక్క కంపెనీ ఎప్పుడూ పెట్టుబడులు పెట్టలేదని విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్