కమిటీలు పేరుతో కాలయాపన వద్దు
ఎస్వి సెట్ కాలేజీ యాజమాన్యంపై చర్య తీసుకోవాలి
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భగత్ రవి డిమాండ్
ప్రజాశక్తి - చిత్తూరు : ఎస్ వి సెట్ కాలేజీలో అదనపు పీజులు పేరుతో యాజమాన్యం పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలపై సమగ్ర విచారణ చేయడానికి కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం గేటు ముందు ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భగత్ రవి మాట్లాడుతూ ఎస్ వి సెట్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం నుంచి వసూలు చేసుకోవాల్సిన ఫీజు రీయింబర్స్ ను విద్యార్థుల నుండి వసూలు చేయడం దుర్మార్గం అన్నారు. ఒకరోజు ఆలస్యమైనా అదనంగా వేల రూపాయలు వసూలు చేస్తూ విద్యార్థినీ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. అధికార బలంతో యాజమాన్యం ఎవరిని లెక్క చేయడం లేదని ''కలెక్టర్ చెప్పుకుంటారా.. మంత్రి చెప్పుకుంటారా ఎవరికైనా చెప్పండి.. మాకు భయం లేదని'' భయపెట్టడం చూస్తే అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. పోలీసు నిర్బంధాల మధ్య కళాశాల ముందు చేరుకొని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు శాంతియుతంగా నిరసన చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి నాయకులు అక్రమ అరెస్ట్
ఎస్ వి సెట్ కళాశాల యజమానం ఫీజుల దోపిడీ, ఒత్తిడి నుంచి విద్యార్థులను కాపాడాలని శాంతియుతంగా నిరసన చేస్తున్న నాయకులను అరెస్ట్ చేసిన పోలీస్ లు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భగత్ రవిని అరెస్ట్ చేసి 2 గంటల పాటు ఏ స్టేషన్ కు తీసుకోకపోకుండా చిత్తూరు చుట్టూ ప్రక్కల పోలీస్ జీపులో తిప్పి చివరకు పెనుమురు స్టేషన్ లో విడుదల చేసారు. ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యంకు కాపలా ఉంటున్నా పోలీసుల చర్య సిగ్గుచేటని, తక్షణమే యాజమాన్యంను శిక్షించాలని, పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి మసూద్ డిమాండ్ చేశారు.
ఎస్ఎఫ్ఐ నాయకుల అక్రమ అరెస్టుకు సిపిఎం ఖండన
శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు తీవ్రంగా ఖండించారు. పోలీసులు చిత్తశుద్ధితో కాలేజీలు జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాలేజీ యాజమాన్యం మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని చాలెంజ్ చేస్తుంటే కమిటీ పేరుతో నిర్లక్ష్యం చేయకుండా చిత్తశుద్ధితో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా చూడాలని డిమాండ్ చేశారు.







కామెంట్లు (0)