బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గూగుల్ డేటా సెంటర్ రైతులను కలిసేందుకు వెళ్తున్న సిపిఎం నాయకుల అరెస్ట్

2 గంటల క్రితం

vijag
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 01:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ భూసేకరణ అంశంపై రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న సిపిఎం నాయకులను పోలీసులు బుధవారం మార్గమధ్యంలో అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీపీఎం మాజీ కౌన్సిలర్ డాక్టర్ బి. గంగారావు, భీమిలి డివిజన్ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి, భీమిలి జోన్ సీఐటీయూ నాయకులు ఎస్. అప్పలనాయుడు, పంపాను సూర్యనారాయణ తదితర నాయకులను తర్లువాడ గ్రామ సచివాలయం వద్ద పోలీసులు అడ్డగించి బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు పార్టీ నాయకులు తెలిపారు. రైతులను కలిసే అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని సీపీఎం నాయకులు ఆరోపించారు. అనంతరం నాయకులను విడుదల చేయడంతో వారు తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులతో సమావేశమై గూగుల్ డేటా సెంటర్ కోసం భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ చర్చించారు. ఈ ఘటనతో తర్లువాడ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్