బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్రమ గ్యాస్ సిలిండర్ల నిల్వలపై తహశీల్దార్ దాడులు

1 గంట క్రితం

guntur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 03:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తెనాలిరూరల్ : తెనాలి బస్ స్టాండ్ పరిధిలో అనధికారికంగా వినియోగిస్తున్న వంటగ్యాస్ సిలిండర్లపై తహశీల్దార్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు దుకాణాలను పరిశీలించగా, వాణిజ్య అవసరాలకు నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న మొత్తం 46 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా లేదా గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ గోపాలకృష్ణ హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ గ్యాస్ సిలిండర్లను వినియోగించే వ్యాపారులు వెంటనే చట్టబద్ధమైన విధానాలను అనుసరించాలని అధికారులు సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్