ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు
ప్రజాశక్తి- ఇబ్రహీంపట్నం : ఎన్‌టిఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద పవిత్ర కృష్ణ–గోదావరి సంగమం ప్రాంతంలో బుధవారం నిర్వహించిన జలహారతి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సిఎం చంద్రబాబుకు మైలవరం ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి, మెడలో ఆకుపచ్చని కండువా కప్పి ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం తెలిపారు. అనంతరం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులతో కలిసి సీఎం కార్యక్రమ వేదికకు చేరుకుని జలహారతిలో పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)