గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏజెన్సీలో నిర్బంధాన్ని ఖండించిన సిపియం

24 జులై, 2026

vsr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 07:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రకటన

ప్రజాశక్తి - విజయవాడ : నేడు రంపచోడవరం సభకు ముఖ్యమంత్రి హాజరవుతున్నారని పేరుతో ఆదివాసీ గిరిజన సంఘం, సిపిఎం నాయకులను నిర్బంధించారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. హౌస్ అరెస్ట్ లు చేయడాన్ని సిపియం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని ప్రకటించారు. ఆదివాసీ యువత ఆగ్రహాన్ని గుర్తించి ఈ రోజు సభలో స్పెషల్ డియస్సీ ప్రకటించాలని, 1/70 చట్ట రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితులకు సమగ్ర పునరావాసం, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్న గిరిజనుల కోర్కెలపై ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్