సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పారా మెడికల్ విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం, అరెస్టులకు సిపిఎం ఖండన

1 రోజు క్రితం

విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 07:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : తిరుపతిలో పారా మెడికల్ విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యం, అక్రమ అరెస్టులను సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. మహిళా విద్యార్థులను అక్రమంగా దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తిరుపతిలో గత 10 రోజుల నుండి పారా మెడికల్ విద్యార్థులు తమ స్టైఫండ్ పెంచాలని శాంతియుతంగా ఆందోళనలు చేశారని తెలిపారు. ఆందోళనలో భాగంగా ఈరోజు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించి తిరిగి వస్తున్న విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడం గర్హనీయం. విద్యార్థి నాయకులు సునీతను జుట్టుపట్టుకొని లాగడం, విద్యార్థులను గాయాలయ్యే విధంగా కొట్టారని ఆగ్రహించారు. అంతేకాకుండా వీరి ఆందోళనకు మద్దతిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు పి. రామ్మోహన్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పవిత్ర, అక్షితతో సహా 10 మంది పారా మెడికల్ విద్యార్థులను అరెస్టు చేశారని తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్బంధంతో అణచివేయాలని చూడటం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని సిపిఎం కోరింది. అలాగే మహిళా విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్